రామయ్య సన్నిధిలో కేంద్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి | - | Sakshi
Sakshi News home page

రామయ్య సన్నిధిలో కేంద్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి

Oct 4 2026 9:43 AM | Updated on Oct 4 2026 9:43 AM

ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని శనివారం కేంద్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎ. వెంకటేశ్వర రావు, ఆయన కుటుంబ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని సీతారామలక్ష్మణుల మూల విరాట్‌ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన వారికి ఆలయ అర్చకులు వీణా రాఘవాచార్యులు ఆలయ విశిష్టత గురించి వివరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ ఏఈవో రవి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement