భారీ లాభాల పేరుతో కుచ్చుటోపీ | - | Sakshi
Sakshi News home page

భారీ లాభాల పేరుతో కుచ్చుటోపీ

Apr 26 2026 2:27 AM | Updated on Apr 26 2026 2:27 AM

భారీ లాభాల పేరుతో కుచ్చుటోపీ

రూ. 2 కోట్ల వసూలు పోలీసులకు బాధితులు ఫిర్యాదు

ఖాజీపేట : మోసపోయే వాళ్లు ఉన్నంత వరకూ మో సగించే వారు ఉంటూనే ఉంటారు.. తాజాగా ఖాజీ పేట మండలంలో చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. బాధితులు వెల్లడించిన ప్రకా రం వివరాలు ఇలా ఉన్నాయి. త్రిపురవరం గ్రామా నికి చెందిన యల్లయ్యతోపాటు తోపాటు మరో వ్య క్తి ఇలా వేర్వేరుగా మోసాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో కథ ఎంచుకుని 5 నెలలుగా భారీగా వసూళ్లు చేశారు. ‘నాకు ఒక పెద్ద కంపెనీకి చెందిన బాస్‌ తెలుసు, అతను రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నాడు. పెద్ద ఎత్తున డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మనం పెట్టుబడి పెడితే చాలు.. మన జీవితాలు మారిపోతాయి. మనం పెట్టే డబ్బు ను బట్టి మనకు నెలనెలా జీతం వచ్చినట్లు డబ్బులు అకౌంట్‌లో పడతాయి’ అని యల్లయ్య మాయమాటలు చెప్పాడు. లక్షలు పెట్టుబడి పెడితే నెలకు లక్ష రూపాయలు జీతంగా వస్తుందని నమ్మించాడు. ఇలా ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.5 లక్షల నుంచి సుమారు 20 లక్షల వరకు వసూళ్లు చేశాడు. ఇలాగే మరొక వ్యక్తి.. ‘చైన్నెలో మాకు తెలిసిన పెద్ద కంపెనీ ఉంది. అందులో నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి. వాటిని తీసుకు రావాలంటే ఖర్చులకు కావాలి.. అందుకు అవసరమైన డబ్బు చెల్లిస్తే మీకు నెలకు రూ. 50 వేల నుంచి లక్ష వరకు జీతం వచ్చినట్లు పెద్ద మొత్తంలో వస్తుంది, లేదంటే రెండింతలు ఇస్తారు’ అని చెప్పి వసూళ్లు చేయడం మొదలు పెట్టాడు. ఇలా వీరు ఖాజీపేట మండలంలోని త్రిపురవరం, కొమ్మలూరు, భాకరాపేట, చాపాడు, కమలాపురం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రూ.2 కోట్లకు పైగానే వసూలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.

లబోదిబోమంటున్న బాధితులు

యల్లయ్య ఐపీ నోటీసులు ఇవ్వడంతో మోసం వెలుగు చూసింది. బాధితులు లబోదిబోమంటున్నారు. చాలా మంది బాండు పత్రం కూడా లేకుండా లక్షల డబ్బులు ఇచ్చారు. మరికొందరు కేవలం పేపర్‌పై రాయించుకుని ఇచ్చారు. ఇంకొందరు బాండ్లు రాయించుకుని డబ్బులు ఇవ్వడం జరిగింది. దీంతో అందరూ మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయాలపై ఖాజీపేట సీఐ వంశీధర్‌ను వివరణ కోరగా.. కొందరు ఈ సమస్యను తమ దృష్టికి తీసుకువచ్చారని, పరిశీలిస్తున్నామని తెలిపారు. అధిక వడ్డీ వస్తుందని, భారీ లాభం వస్తుందని మాయగాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

రాణి కాలువలో మృతదేహం వెలికితీత

జమ్మలమడుగు రూరల్‌ : రాణి కాలువలో పడి మృతి చెందిన మోరగుడి గ్రామానికి చెందిన కుండా చిన్న చౌడయ్య(65) మృతదేహన్ని శనివారం వెలికితీశారు. మోరగుడి గ్రామంలోని శ్రీరాములపేటలో ఉన్న రాణి కాలువలో శుక్రవారం మృతదేహం ప్రత్యక్షం కావడంతో వెలికి తీయడానికి పోలీసులు ప్రయత్నించారు. కాగా రాత్రి కావడంతో తీయడానికి వీలు పడలేదు. చిన్న చౌడయ్య 3 రోజుల క్రితం మద్యం మత్తులో కాలువలో పడి మృతి చెందినట్లు తెలుస్తోందని ఆయన కుమారుడు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ హైమావతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement