2023లో ఇక్కడ 150 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు. దీంతో ఇళ్లు కూడా కట్టుకున్నాం. ఇంకొందరు పునాదులు వేసుకున్నారు. ఇళ్లు కట్టిన వారిని ఖాళీ చేయాలని పునాదులు వేసిన వారిని తొలగించాలని బెదిరిస్తున్నారు. ఇక్కడ అంతా పేదలే. అప్పుడప్పుడు వచ్చి హెచ్చరించి వెళుతున్నారు. అందరికీ కోర్టు స్టే కూడా ఉన్నా దౌర్జన్యానికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అష్టకష్టాలు పడి కట్టుకున్న పునాదిని జేసీబీతో ధ్వంసం చేశారు. నేను ఒంటరి మహిళను. దిక్కుతోచడం లేదు.
– మొబీనా, బాధితురాలు, అంగళ్లు గ్రామం, కురబలకోట మండలం


