రైతాంగ ప్రయోజనాలను కాలరాస్తున్న చంద్రబాబు ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేశారో సమాధానం చెప్పాలి. సొంత నియోజకవర్గ కుప్పానికి కృష్ణా జలాలు తరలించిన ఘనత జగనన్నది. ఆయన హంద్రీనీవా పనులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చి చూపించారు. ఇప్పుడు ఇదే కాలువలో నీటిని తరలించుకుంటూ నేనే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. కుప్పానికి మాత్రమే నీళ్లు తీసుకుపోతున్న చంద్రబాబు..నీళ్లు లేక అల్లాడుతున్న పెద్దమండ్యం, తంబళ్లపల్లె గురించి ఎందుకు పట్టించుకోవడంలేదు. చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరాల్సిందే. –పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే


