స్టాక్‌ పాయింట్లకు సీసీ కెమెరాలు | - | Sakshi
Sakshi News home page

స్టాక్‌ పాయింట్లకు సీసీ కెమెరాలు

Jan 28 2026 7:06 AM | Updated on Jan 28 2026 7:06 AM

స్టాక

స్టాక్‌ పాయింట్లకు సీసీ కెమెరాలు

స్టాక్‌ పాయింట్లకు సీసీ కెమెరాలు టీ20 మ్యాచ్‌ స్కోరర్‌గా రామకృష్ణ నేడు వైవీయూలో క్యాంపస్‌ డ్రైవ్‌ జాతీయ హాకీ జట్టుకు ఎంపిక డీఆర్‌ ఆకస్మిక తనిఖీ

మదనపల్లె: జిల్లాలోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న సాంకేతిక సిబ్బంది దరఖాస్తులు చేసుకోవాలని మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ ఒక ప్రకటన తెలిపారు. బి.కొత్తకోట, పీలేరు, కలికిరి, వాయ ల్పాడు, తంబళ్లపల్లె నిత్యావసర సరుకుల గోదాముల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి ఎవరైనా ఎంత ఖర్చు అవుతుందో కొటేషన్లను సమర్పించాలని కోరారు. ఈనెల 30వ తేదీలోగా పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌కు తమ కొటేషన్లు అందజేయాలని కోరారు.

వాల్మీకిపురం: విశాఖపట్నంలో బుధవారం జరగనున్న ఇండియా, న్యూజిల్యాండ్‌ మధ్య జరగనున్న టి20 మ్యాచ్‌ స్కోరర్‌గా వాల్మీకిపురానికి చెందిన రామకృష్ణ ఎంపికై నట్లు జీవీఎస్‌సీఎస్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకిపురం నుంచి క్రికెట్‌ ఆడుతూ తర్వాత స్కోరర్‌గా, చిత్తూరు జిల్లా, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ పరీక్షల్లో సెలెక్ట్‌ అయ్యి 10 ఏళ్లుగా స్కోరర్‌గా ఉన్నారన్నారు. ఈ అవకాశం రావడానికి కృషి చేసిన విజయకుమార్‌, శ్రీనివాస్‌ మూర్తి, సతీష్‌ యాదవ్‌, శ్రీధర్‌కుమార్‌, సునీల్‌ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. టీ20 మ్యాచ్‌ స్కోరర్‌గా ఎంపికైన రామక్రిష్ణను సీనియర్‌ క్రీడాకారులు భరత్‌, విష్ణు, చైతన్య, కిషోర్‌, షాహెద్‌, జావిద్‌, లాల, రెడ్డి, ముజీర్‌, ఉదయ్‌కుమార్‌, జాకీర్‌, వెంకటేష్‌ అభినందించారు.

కడప ఎడ్యుకేషన్‌: యోగి వేమన విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఆఫ్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ టి.శ్రీనివాస్‌ తెలిపారు. బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీ ఉద్యోగుల ఎంపికలకు వైవీయూకు వస్తోందన్నారు. రెండు రౌండ్లు ఇంటర్వ్యూ ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, హెచ్‌ ఆర్‌ రౌండ్‌, ఆపరేషనల్‌ ( ఓపిఎస్‌ ) రౌండ్‌ ఉంటుందన్నారు. విద్యార్థులందరూ వారి రెజ్యూమ్‌ హార్డ్‌ కాపీతో నూతన పరిపాలనా భవనంలోని ప్లేస్‌మెంట్‌ సెల్‌లో ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని సూచించారు.

పులివెందుల టౌన్‌: పులివెందులకు చెందిన హాకీ క్రీడాకారుడు ఎం.సంజయ్‌ జాతీయ హాకీ జట్టుకు ఎంపికై నట్లు ఖేలో ఇండియా కోచ్‌ రవికుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతనెల్లో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 బాలుర రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం.సంజయ్‌ జాతీయ జట్టుకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలలో పాల్గొంటారన్నారు.

మదనపల్లె రూరల్‌: మదనపల్లె పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా రిజిస్ట్రార్‌ ఏ.వెంకటరమణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్‌లు, మార్కెట్‌ ఫీజులపై సబ్‌ రిజిస్ట్రార్‌ గురుస్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో భూముల ధరల పెంపుపై ప్రతిపాదనలు మార్కెట్‌ రేట్స్‌ రివైజ్డ్‌ కమిటీ చైర్మన్‌ జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలనకు తీసుకెళుతున్నామన్నారు. అన్నమయ్య జిల్లాలో గతంలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా రాజంపేట, సుండుపల్లె వైఎస్సార్‌ కడప జిల్లాకు, చిట్వేల్‌, పుల్లంపేట తిరుపతి జిల్లాకు కేటాయించారన్నారు. అన్నమయ్యజిల్లాలోకి కొత్తగా పుంగనూరు చేరడంతో ప్రస్తుతం 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో భూముల ధరలు పెంపుపై రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలోని అర్బన్‌ ఏరియాల్లో భూముల మార్కెట్‌ విలువలు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నాయన్నారు. ఎంత మేర పెంచాలనే విషయమై జేసీ ప్రకటిస్తారన్నా రు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, పీకేఎం–ఉడా, చుడా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిధిలోని గ్రామాల్లోనూ భూముల మార్కెట్‌ విలువలు పెరుగుతాయన్నారు. పెరిగిన మార్కెట్‌ విలువ లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.

స్టాక్‌ పాయింట్లకు  సీసీ కెమెరాలు 1
1/1

స్టాక్‌ పాయింట్లకు సీసీ కెమెరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement