ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రానికి చెందిన టంగుటూరి చరణ్ అనే చేనేత కార్మికుడితో పాటు పలు కుటుంబాల వారు గురువారం తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ గతంలో జగనన్న చేనేత కార్మిక కుటుంబాలను ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఆదుకున్నాడని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము వైఎస్సార్‌సీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహమూద్, జెడ్పీటీసీ శివన్న, మండల కన్వీనర్ కొట్టి మల్లికార్జున, బూత్ కమిటీ మండల కన్వీనర్ కల్లేగారి మంజునాథ్, మేకల చంద్ర, అయూబ్, సాదిక్, సుబ్బిరెడ్డి, ఓబులేసు,బాబు, సిద్దీక్, తదితరులు పాల్గొన్నారు.


