సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై దృష్టి
రాయచోటి: సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రైతుల నుంచి ధాన్యం సేకరణ, ప్రజల నుంచి వివిధ అంశాలపై సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సిటిజన్ సర్వే, సంక్షేమ హాస్టళ్లలో పారిశుధ్యం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులకు ఆయా శాఖల అంశాలకు సంబంధించి తగిన సూచనలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలో కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్


