మిథున్‌రెడ్డి పర్యటనపై పోలీస్ నిఘా
పర్యటన విజయవంతం
మదనపల్లె: మదనపల్లెలో గురువారం జరిగిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ.మిథున్‌రెడి పర్యటన అద్యంతం పోలీసు నిఘా నీడలో సాగింది. ఆయన మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఆంక్షలు, నిఘా పెట్టారు. మండలంలోని ఆరోగ్యవరం సమీపంలోని హైవేపై ఫ్లైఓవర్ వద్దకు మిథున్‌రెడ్డి చేరుకునే ముందు అక్కడ వేచి ఉన్న సమన్వయకర్త నిసార్ ఆహ్మద్ వద్దకు వచ్చిన తాలూకా సీఐ కళా వెంకటరమణ..పార్టీ పరంగా బైక్ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించరాదని, దీనికి అనుమతి లేదంటూ చెప్పి వెళ్లారు. మిథున్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలు స్వాగతం పలికిన ప్రాంతం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మంజూరైన నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాల ఉంది. దాంతో మిథున్‌రెడ్డి ఆకస్మాత్తుగా పరిశీలన కోసం అక్కడికి వెళ్లే అవకాశం ఉంటే ముందుగానే నిలువరించేందుకు ఆ రహదారిపైన, అక్కడికి వెళ్లే రోడ్లవద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడినుంచి మొదలైన పర్యటనపై పోలీసులు డ్రోన్‌తో నిఘా పెట్టి ఆయన వెంట కొనసాగించారు. రహదారులు, వాటికి అనుసంధానమైన రోడ్ల వద్ద, జాతీయ రహదారిపైనా పోలీసులను పెట్టారు. ఎంపీడీఓ కార్యాలయం చేరే వరకు పట్టణం, తాలూకా పరిధిలోకి సీఐలతోపాటు పొరుగు స్టేషన్లకు చెందిన సీఐలను, ఎస్‌ఐలు, పోలీసులను రప్పించి బందోబస్తు విధులు అప్పగించారు. వారంతా మిథున్‌రెడ్డి పర్యటన సాగిన అన్నిచోట్లా కనిపించారు. మదనపల్లె మండల పరిషత్ కార్యాలయం వెలుపల, లోపల బందోస్తు ఏర్పాటు చేయగా..కార్యాలయం లోపలికి వెళ్లే వారిపై ఆంక్షలు విధించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, కార్యాలయ సిబ్బందికి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మిథున్‌రెడ్డి కార్యాలయం చేరుకున్న తర్వాతనే సాధారణ ప్రజలను, నాయకులను లోపలికి పంపారు.
తిరుగు ప్రయాణం దారి మళ్లింపు
సమావేశం, పర్యటన ముగిశాక ఎంపీడీవో కార్యాలయం నుంచి మిథున్‌రెడ్డి సీటిఎంరోడ్డు మీదుగా దేవతానగర్‌కు వెళ్లాల్సి ఉంది. ఇదే దగ్గరదారి అయితే పోలీసులు దారిమళ్లించడంతో గాంధీరోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు మీదుగా బైపాస్‌రోడ్డు నుంచి బైపాస్‌సర్కిల్ మీదుగా తిరిగి మదనపల్లైవెపుకు వచ్చి దేవతానగర్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీనికోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చింది.
వినతులు స్వీకరించి వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ మిథున్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పర్యటనలో డ్రోన్ నిఘా
పర్యటనంతా డ్రోన్‌తో చిత్రీకరణ
మెడికల్ కళాశాల వద్ద బందోబస్తు
మిథున్‌రెడ్డి మదనపల్లె పర్యటన సూపర్ సక్సెస్
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మదనపల్లె పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రజా సమస్యలు తెలుసుకుని, వినతులు స్వీకరించడం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయనకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజల నుంచి అడుగడు గునా ఘనస్వాగతం లభించింది. మహిళలు హరతులు పట్టగా నేతలు గజమాలలు, పూలమాలలతో సత్కరించారు. ఆరోగ్యవరం సమీపంలోని ప్లైఓవర్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు కూడళ్ల వద్ద జనం బారులుతీరారు. బాణసంచా కాలుస్తూ, మేళ తాళాలతో స్వాగతం పలికారు. కార్యాలయంలో ప్రజలనుంచి వినతుల స్వీకరణపై ఫిర్యాదుదారుల్లో సంతృప్తి వ్యక్తమైంది. తమ సమస్యలను ఎంపీ ఒపిగ్గా విన్నారని, పరిష్కారానికి భరోసా ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.
మిథున్‌రెడ్డి పర్యటనపై పోలీస్ నిఘా


