రైలు ఢీకొని 28 గొర్రెలు మృతి
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కృష్ణాపురం సమీపంలో రైల్వే పట్టాలను దాటుతూ 28 గొర్రెలు రైలు ఢీకొని మృతి చెందాయి. కమలాపురం వైపు నుంచి కడప వైపు గురువారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో తాడిగొట్ల గ్రామానికి చెందిన కె.సురేంద్ర అనే రైతుకు చెందిన దాదాపు 28 గొర్రెలు మృతి చెందాయి.
కుక్కల దాడిలో..
వేంపల్లె : చక్రాయపేట మండలం ఎరగ్రుడి తండాకు చెందిన ఈదేశే గాంగే నాయక్ అనే వ్యక్తికి చెందిన ఆరు గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. మంగళవారం రాత్రి యధావిధిగా బాధితుడు గొర్రెల పిల్లలను గొర్రెల దొడ్డిలోకి వేశాడు. ఆ తర్వాత అర్థరాత్రి తర్వాత కుక్కలు దాడి చేశాయి. అందులో ఆరు గొర్రెల పిల్లలు గాయపడి చనిపోయాయి. గతంలో కూడా చాలాసార్లు దాడులు జరిగి గొర్రెలు మృతి చెంది నష్టపోయామని బాధితుడు వాపోతున్నాడు. అధికారులు స్పందించి కుక్కల దాడి నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు.


