గడువు పొడిగింపు
రాయచోటి టౌన్ : సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత సర్వీసెస్ సెంటర్ ద్వారా కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి ఆర్ నాగేంద్ర రాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వీరికి ఉచిత శిక్షణ, బోజనం, బస కల్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ స్క్రీనింగ్ నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 14నుంచి విజయవాడలో శిక్షణ ఇస్తారన్నారు.మరిన్ని వివరాలకు 7989819470/ 96766 98175 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
రాయచోటి: రాయచోటిలో నూతనంగా నిర్మించబోతున్న ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పరిశీలించారు. గురువారం సాయంత్రం రాయచోటి–పీలేరు రోడ్డు సమీపంలో కేటాయించిన స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలం, ఇతర అంశాలపై రెవెన్యూ సిబ్బందికి సూచనలు చేశారు.
రాయచోటి: అటల్ ప్రయోగశాలలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, వీటిని సక్రమంగా వినియోగించుకుంటే శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులుగా రూపొందుతారని అటల్ టింకరింగ్ పాఠశాలల వర్క్‌షాప్‌ను యునిసెఫ్ ప్రతినిధి సుదర్శన్ అన్నారు.రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వర్స్‌షాప్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు రూపొందిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించారు. అటల్ టింకరింక్ ప్రయోగశాలలో క్యాలెండర్‌ను అనుసరించి విద్యార్థులతో ప్రాజెక్టులు చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్ర సమగ్ర శిక్ష, యునిసెఫ్ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహిస్తున్నటు తెలిపారు. సమగ్ర శిక్ష అసిస్టెంట్ ఏఎంఓ అసదుల్లా, జిల్లా సైన్స్ అఽ ధికారి మార్ల ఓబుల్ రెడ్డి, రీసోర్స్ పర్సన్ ఆంజనేయులు, వే ణుగోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా పాల్గొన్నారు.
గడువు పొడిగింపు


