మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి పర్యటన ఇలా..
ఈ రైతు పేరు రామచంద్రారెడ్డి. వేముల మండలం భూమయ్యగారిపల్లె. 14 ఎకరాలు అరటి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.1.20 లక్షల చొప్పున సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సరాసరిగా ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున ఆదాయం గడించాల్సి ఉంది. అరటి కోతకు వచ్చే సమయానికి మార్కెట్‌లో ధరలు పడిపోయాయి. టన్ను రూ.1500తో ఇస్తామన్నా వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో 8 ఎకరాల్లో అరటితోటను తొలగించాడు. దాదాపు అరటి రైతులందరిదీ ఇదే పరిస్థితి.
పంటలు నాడు వైఎస్ జగన్ నేడు చంద్రబాబు
హయాంలో సర్కార్‌లో
అరటి టన్ను రూ.25వేలు రూ.7వేలు
పత్తి క్వింటా రూ.13వేలు రూ.6వేలు
ఉల్లి క్వింటా రూ.3వేలు రూ.5వందలు
చీనీ టన్ను రూ.70 వేలు రూ.12వేలు
మామిడి టన్ను రూ.50 వేలు రూ.10వేలు
(బేనీషా)
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లాలో 20,231 ఎకరాల్లో అరటి సాగుచేశారు. అందులో ప్రధానంగా పులివెందుల, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, కాశినాయన, మైదకూరు మండలాల్లోనే సుమారు 16వేల ఎకరాల్లో సాగుచేశారు. మొదట్లో లింగాల, పులివెందుల, వేముల మండలాల్లో అత్యధికంగా సాగుచేస్తున్న అరటి సాగు జిల్లాలో క్రమేపీ పెరిగింది. అందుకు కారణం లేకపోలేదు. పెట్టుబడి పెట్టినా, గ్యారెంటీగా ఆదాయం వస్తుండడంతో అరటి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. రెండు దశాబ్దాలుగా అరటి పంట వల్ల గణనీయమైన ఆదాయాన్ని రైతులు కళ్ల చూశారు. ఈమారు అరటి రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. దిగుబడులున్నప్పటికీ, పంటను విక్రయించుకోలేని దుస్థితి రైతులకు దాపురించింది. విదేశాలకు ఎగుమతి లేదు. ఆ దిశగా చంద్రబాబు సర్కార్ చర్యల్లేవు. ఉత్తరాది రాష్ట్రాల్లో అపారంగా దిగుబడులు ఉండడం..అటు వైపు విక్రయించే పరిస్థితి లేకపోవడంతో అరటి రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరటి పంటను పరిశీలించనున్నారు.
నిమ్మకు నీరెత్తినట్లుగా
చంద్రబాబు సర్కార్...
అరటి పంటపై నమ్మకం పెట్టుకున్న రైతుల పెట్టుబడులకు తగ్గ దిగుబడులు ఉన్నాయి. సరాసరిగా 20 నుంచి 25 టన్నుల దిగుబడి ఉంది. కాగా, మార్కెటింగ్ లేకపోవడంతోనే అసలు సమస్య ఏర్పడింది. వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో అరటి రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సకాలంలో విక్రయించడం మినహా, నిల్వ చేసుకునేందుకు యోగ్యకరమైన పంట కాదు. పైగా అరటి ఆధారిత పరిశ్రమలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భరోసాగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచనే చేయడం లేదు.
నాటి ధీమా కరువు..
నాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచింది. ప్రతి పంటకు మద్దతు ధర లభించింది. అరటి టన్ను రూ.25వేలు తగ్గకుండా పలికింది. చీనీ టన్ను రూ.50 వేల నుంచి రూ.80 వేలు పలికిన సందర్భాలు లేకపోలేదు. మామిడి, ఉల్లి, ఇలా ఉద్యాన రైతులంతా ఠీవిగా ఉండేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతే పరిహారం నెలరోజుల్లోపే రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోగా రైతన్నా.. మీ కోసమంటూ మరో కొత్త ప్రచారానికి తెరతీశారనే విమర్శలున్నాయి.
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 8.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఇటీవల మృతి చెందిన లింగాల మాజీ సర్పంచ్ మహేష్‌రెడ్డి ఇంటికి చేరుకుంటారు. మాజీ సర్పంచ్ మహేష్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. 12.30 నుంచి 2 గంటల వరకు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. 2 గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి ఇంటికి చేరుకుంటారు. లింగాల రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. అక్కడి బయలుదేరి 4 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 4 గంటల నుంచి 7 గంటల వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. 7 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి స్వగృహానికి బయలుదేరుతారు. 7.05 గంటలకు తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
అరటి రైతులది అరణ్య రోదన
రెండు దశాబ్దాలుగాఎన్నడూ లేని దుస్థితి
నిలువునా తోటలు దున్నేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
నేడు మాజీ సీఎంవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరటి పంటల పరిశీలన
నాడు ధైర్యం.. నేడు దైన్యం!
నాడు ధైర్యం.. నేడు దైన్యం!


