జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ జట్టుకు మట్లి విద్యార్థులు
రాయచోటి టౌన్ : రాయచోటి డివిజన్ పరిధిలోని మట్లి పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముగ్గురు జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. జయన్న తెలిపారు. ఈ మేరకు జాతీయ జట్టుకు ఎంపికై న విద్యార్థులను మంగళవారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి 24 వరకు పులివెందులలోని రమణప్ప సత్రంలో నిర్వహించిన సాఫ్ట్‌బాల్ అండర్ –14 విభాగంలో బాలికల, బాలుర విభాగంలో నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపిక వారిలో కె. రెడ్డిగీత (9వ తరగతి), సి. హేమశ్రీ (8వ తరగతి), యు. సుబ్రహ్మణ్యం (9వ తరగతి) ఉన్నట్లు తెలిపారు. వీరు ముగ్గరు వచ్చే జనవరిలో ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను జాతీయ స్థాయికి ఎదిగేందుకు కృషి చేసిన పీడీ ఏ. జగదీశ్వరయ్యను పాఠశాల కమిటీ చైర్మన్ పి. నాగేశ్వరావు, ఉపాధ్యాయులు అభినందిచారు.


