రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి
సిద్దవటం: రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు చంద్రానాయక్ తెలిపారు. మండలంలోని కడపయపల్లి గ్రామం టక్కోలు రైతు సేవా కేంద్రం పరిధిలో మంగళవారం జరిగిన రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఉద్దేశాలపై రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి రమేష్‌రెడ్డి, వీఏఏ జైపాల్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం సిద్దవటం జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్మిస్తున్న సెంట్రల్ కిచెన్ షెడ్ పనులను జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు చంద్రానాయక్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణి రాజకుమారి, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ సోమశేఖర్, వ్యవసాయాధికారి రమేష్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు, ఏఈఓ ప్రభాకర్‌ఎడ్డి తదితరులు పాల్గొన్నారు.


