● వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు నేతలు..
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి చర్చించారు. ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాయచోటి, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, కదిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి మగ్బూల్ బాషా, వైఎస్సార్‌సీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి చవ్వా దుష్యంత్‌రెడ్డిలతోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు కలిశారు. అలాగే విజయవాడ, నల్గొండ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నాయకులు కలిశారు.


