టీడీపీకి వేమన సెగ!
మహిళ గళం విప్పడంతో..
టాస్క్‌ఫోర్స్: టీడీపీ అధిష్టానానికి తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ వ్యవహారం సెగ తాకింది. రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తానని దళిత మహి ళకు చేసిన తీరు తెన్నులు ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఏమి చేయాలో తెలియని స్ధితిలో ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నా రు. మరీ వేమన సతీష్‌పై అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..
పార్టీ అధినేతలతో పరిచయాలంటూ..
ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారాలోకేష్‌తనకు తెలుసునని చెప్పుకుంటూ అవకాశం ఉన్న వరకు వివిధ రకాల లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపణలు ఇప్పుడు వేమన సతీష్ ఎదుర్కొంటున్నారు. పరిచయాలను అడ్డం పెట్టుకొని సంపాదన ధ్యేయంగా అడ్డదారులకు తెర తీశారని తెలిసింది. ఈ క్రమంలో మనీమ్యాటర్ వ్యవహారాలను చక్కబెట్టుకొని ముందుకు వెళుతున్నారని విమర్శలు కూడా సతీష్‌ను చుట్టుముడుతున్నాయి.
అధికారమే అండగా..
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేమన సతీష్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న కార్యకలాపాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజంపేట–రాయచోటి మార్గంలోని తన తోటకు ఓ సినీనిర్మాత వస్తే ఆయనకు పట్టణ సీఐ ఒకరు అనధికారికంగా ఎస్కార్ట్ నిర్వహించారు. అది కూడా వివాదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సీఐ బదిలీ అయిపోయారు. అధికారమే అండగా వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు దారితీసింది.
తానా అధ్యక్షునిగా..
రాజంపేట, రైల్వేకోడూరులో పెద్దగా పరిచయం లేని వ్యక్తి. ఒక్కసారిగా అమెరికాలో తానా అధ్యక్షునిగా ఎన్నిక కావడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తర్వాత తానాలో దారితీసిన అనేక వివాదాలు, ఆరోపణలతో సద్దుమణిగిపోయారు.రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి రాగానే రాజంపేట టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు.టీడీపీ అధికారంలోకి వచ్చాక, తానా ద్వారా వచ్చిన పరిచయాలను సతీష్ తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు.
రైల్వేకోడూరుకు చెందిన దళితమహిళ టీడీపీ టికెట్ ఇప్పిస్తానని, రూ.7కోట్ల తీసుకున్నారని ఆరోపించడంతో వేమన సతీష్ వ్యవహారం తీరు బట్టబయలైంది. ో కాగా రాజంపేట పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు బాధితురాలు స్వయంగా ఆరోపించింది. మరికొందరి వద్ద కూడా వివిధ పనులు చేయిస్తానని వసూళ్లు చేసినట్లు రాజంపేటలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రాజంపేట–రాయచోటి రహదారిలో వివాదంలో ఉన్న విలువైన స్థలాన్ని వేరే ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మనీ కోసం లాబీయింగ్
బాబు, లోకేష్ పరిచయాలతో గాలం
తెరపైకి రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తానన్న వ్యవహారం
వేమన సతీష్ తీరుపై విస్మయం


