10న ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపింక
రాజంపేట టౌన్: రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 10 వతేదీన ఉమ్మడి వైఎస్సార్‌జిల్లా స్థాయిలో పెన్సింగ్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఫెన్సింగ్ అసోషియేషన్ జిల్లా కార్యదర్శి ఎ. చంద్రకళావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 వతేదీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగే స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్‌మెన్ ,ఉమెన్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల కు క్రీడా కారులను రాజంపేటలో ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్ 31 వ తేదినాటికి 14 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు ఫెన్సింగ్ అసోసియోషన్ ఆప్ ఇండియా వారి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన వారు గతంలో ఆడిన గుర్తింపు పత్రాలను తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9490863917 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు జరిపారు. టీటీడీ ఏఈఓ బాలరాజు సమర్పించిన పట్టు వస్త్రాలు , బంగారు అభరణాలు, తులసి గజమాలతో సీతారామలక్ష్మణులను అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రావణ్‌కుమార్, పవన్‌కుమార్‌లు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో అండర్–11 బాల బాలికల రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. శనివారం నిర్వహించిన క్యాలిఫయింగ్ రౌండ్లకు తమ సత్తా చాటేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు దాదాపు 400 మంది వరకు హాజరైనట్లు డీఎస్‌డీఓ బాషా, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ జిలానీ బాషా, సెక్రటరీ నాగరాజు తెలిపారు. నేటి నుంచి నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలు 11 తేదీ వరకు జరుగుతాయన్నారు. కాగా తొలి రోజు 38 మంది క్వాలిఫై అయ్యారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఈ ఏడాది అండర్–11జాతీయస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు డిసెంబర్ 8 నుంచి 14 వరకు గుజరాత్‌లోని వడదోరలో జరగనున్నాయని వెల్లడించారు.
10న ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపింక


