అలరించిన ఖవ్వాలీ
నాత్ గీతాలు ఆలపిస్తున్న గాయకులు దర్గాలో ప్రార్థనలు చేస్తున్న పుష్ఫ ఫేం జగదీష్
కడప సెవెన్‌రోడ్స్: కడప పెద్దదర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాల్గవరోజు శనివారం పలు భక్తి కార్యక్రమాలు కొనసాగాయి. దర్గా పీఠాధి పతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ భక్తుల సమస్యలను తెలుసుకుని పరిష్కారాలు సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి ఉరుసుకు హాజరైన ఫకీర్ల కార్యకలాపాలు, నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఉరుసుకు హాజరైన చౌదరీలు, ఖలీపాలతో సమావేశమై ఉరుసులో సేవలు అందించినందుకు ప్రశంసంగా విశేష వస్త్రాలను అందజేశారు.
నటుడు జగదీష్ ప్రార్థనలు
ప్రముఖ సినీ నటుడు పుష్ప ఫేం జగదీష్ పెద్ద దర్గా కు విచ్చేశారు. ఉరుసు నేపథ్యంలో దర్గాకు వచ్చిన ఆయన గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతెహా నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆకట్టుకున్న ఖవ్వాలీ కచేరి
ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రార్థనలకు, అనంతరం నిర్వహించిన ఖవ్వాలీ కచేరికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెహఫిల్–యే–సమ పేరిట సాగిన ఈ కార్యక్రమంలో గాయకులు సూఫీ తత్వంతో కూడిన పాటలను ఆలపించి భక్తులను ఆకట్టుకున్నారు.
దుకాణాల జనం రద్దీ:దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద బాగా రద్దీ కనిపించింది. అలాగే ఎగ్జిబిషన్ ప్రాంతంలోనూ సందడి కనిపించింది. ఎక్కడాఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లుచేసింది.
అలరించిన ఖవ్వాలీ
అలరించిన ఖవ్వాలీ


