
దోపిడీ దొంగ అరెస్ట్
రాజంపేట రూరల్ : ఏరుకాల్వ రమాదేవి అనే మహిళపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన వేముల విశ్వనాథంను అరెస్టు చేసినట్లు ఏఎస్‌పీ మనోజ్‌రామ్‌నాథ్‌్‌హెగ్డే తెలియజేశారు. మండల పరిధిలోని ఎర్రబల్లిలో గల డీఎస్‌పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఏఎస్‌పీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన పుల్లంపేట మండలం వత్తలూరు వడ్డిపల్లి గ్రామానికి చెందిన రమాదేవిపై పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి గ్రామం మొరవడ్డిపల్లికి చెందిన వేముల విశ్వనాథం దాడి చేసి బంగారం దోచుకెళ్లారని తెలియజేశారు. విశ్వనాథంను రూరల్ సీఐ బీవీ రమణ ఆధ్వర్యంలో పుల్లంపేట, పెనగలూరు ఎస్‌ఐలు బీవీ శివకుమార్, బీ రవిప్రకాశ్‌రెడ్డి రెడ్డిపల్లి చెరువు కట్టవద్ద తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. అతని వద్ద నుంచి 92,030 గ్రాముల బంగారం స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.9,50000లు ఉంటుందన్నారు. విశ్వనాథం నేరానికి ఉపయోగించిన రక్తపు మరకలు కలిగిన రాయిని సీజ్ చేశామన్నారు. అదే విధంగా ఒక ఫల్సర్ బైక్, ఓపీపీఓ సెల్‌ఫోన్‌ను సీజ్ చేశామని తెలియజేశారు. అయితే ఈ బంగారు ఆభరణాలు చిత్తూరు జిల్లాలోని సదుం, అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట, పెనగలూరు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నమోదు అయిన కేసులలోని బంగారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
విలేకరితోపాటు ముగ్గురిపై కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఓ విలేకరితోపాటు ముగ్గురు యువకులపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 27న ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పినందుకు కానిస్టేబుల్‌ను నలుగురు యువకులు తోశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. వారిలో ఓ విలేకరి కూడా ఉండటం గమనార్హం.
● 9 తులాల బంగారం స్వాధీనం
● ఏఎస్‌పీ మనోజ్‌రామ్‌నాథ్‌హెగ్డే