
సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం
బ్రహ్మంగారిమఠం : విశ్వ బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఉద్యమిస్తామని విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు అన్నారు. బ్రహ్మంగారిమఠంలోని విరాట్ విశ్వకర్మ భవన్‌లో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ అడిషనల్ పోలీస్ కమిషనర్ కె.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐకమత్యంతో ముందుకు సాగితే రాజ్యాధికారంలో వాటా సాధ్యమని తెలిపారు. ఏపీ విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘం లీగల్‌సెల్ చైర్మన్ పేరుసోముల గురుప్రసాద్ ఆచారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాకుగానీ, కొత్తగా బద్వేలు జిల్లా ఏర్పడితే దానికి వీరబ్రహ్మేంద్రస్వామి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు జవ్వాది కూర్మాచార్యులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు ప్రతి ఎన్నికల్లో ఎంపీ, రెండు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇ.వెంకటాచారి మాట్లాడుతూ తిరుమలలో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం, వసతిగృహం నిర్మాణం కోసం భూమి కేటాయించాలని టీటీడీ కోరింది. విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి మాట్లాడుతూ మంగళ సూత్రం తయారీ హక్కుదారులుగా విశ్వబ్రాహ్మణ, స్వర్ణకారులకు వీలు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దార్ల పాపయ్య, విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు అంగలకుదిటి సుశీల, తాళభద్ర వాసవి, నాగార్జున, తుంపాల వెంకటేశ్వర్లు, లక్కోజు సుజాత, వినుకొండ సుబ్బారావు, శ్రీనివాస ఆచారి, దశరథ ఆచారి, రంగాచారి, అప్పలస్వామి, శేషగిరి రావు, శేష బ్రహ్మ ఆచారి, చిలకపాటి మధుబాబు, మోడపల్లె నాగు, రామకృష్ణ ఆచారి, పద్మావతి, సాయి, శివ, ఫణీంద్రకుమార్, వీరాచారి, పలు జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు