
శభాష్.. అసద్
రాయచోటి జగదాంబసెంటర్: రెడ్ టెన్నిస్ బాల్ అండర్ –19 జాతీయ క్రికెట్ జట్టుకు రాయచోటికి చెందిన అసద్ ఎంపికయ్యాడు. శనివారం ఉత్తరాఖండ్‌లో జాతీయ స్థాయి టోర్నీలో అసద్ తెలంగాణ జట్టు తరపున పాల్గొని, జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించినట్టు కుటుంబసభ్యులు ఇక్కడి విలేకరులకు తెలియజేశారు. దీంతో అసద్ జాతీయ జట్టుకు ఎంపికై వచ్చే నెలలో శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటారన్నారు. కాగా అసద్ రాయచోటిలోని నిదా టెక్నో స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. అసద్ జాతీయ జట్టుకు ఎంపికవ్వడం పట్ల స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.