
సాఫ్ట్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
పుల్లంపేట : స్థానిక మోడల్ స్కూల్ క్రీడా మైదానంలో కడప జిల్లా సబ్ జూనియర్ బాలబాలికలు, సీనియర్ పురుషుల సాఫ్ట్ బాల్ జట్లను శనివారం ఎంపిక చేసినట్లు రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సభ్యులు ఎస్‌పి.రమణ, నరసింహారెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ అక్టోబర్ 3, 4, 5వ తేదీలలో విశాఖపట్టణంలో జరిగే సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొనే ఉమ్మడి కడప జిల్లా జూనియర్ బాల, బాలికల జట్టును, నవంబర్‌లో జరిగే సీనియర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు పురుషుల జట్టును ఎంపిక చేశామన్నారు. ఒక్కో జట్టులో పదహారు మంది సభ్యులు ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో ఆల్పామైరెన్ అధినేత సుధాకర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లీలాశ్రీహరి, ఫిజికల్ డైరెక్టర్ నీలకంఠరావు పాల్గొన్నారు.
జీఎస్‌టీ తగ్గింపుతో అందరికీ ప్రయోజనం
రాయచోటి టౌన్ : కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ తగ్గించడంతో సాధారణ ప్రజలందరికీ ప్రయోజనం ఉందని అన్నమయ్య జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. వైద్య సిబ్బందితో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 25వతేదీ నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు సూపర్ జీఎస్‌టీ సూపర్ సేవింగ్ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా శాఖల వారీగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జీఎస్‌టీపై అవగాహన, 30వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు వ్యవసాయం, ఉద్యానవనం, ఉపాధి హామీ కూలీలకు అవగాహన, 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మానవ వనరులు, విద్య, ఆరోగ్యం, అభివృద్ధి సాధికారితలపై అవగాహన, 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ వికాస్ విశ్వాస ర్యాలీలు, సమావేశాలు, క్విజ్ పోటీలు, సెమినార్లు, వివిధ రకాల పోటీల నిర్వహణ, 19నుంచి మండల, జిల్లా స్థాయి దీపావళి సంబరాలు ఉంటాయని తెలిపారు.
టీకాతో ప్రాణాంతక వ్యాధులు నయం
– జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు
సిద్దవటం : ప్రాణాంతకమైన వ్యాధులను టీకాతో నయం చేయవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్యఖాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. మండలంలోని పొన్నవోలు కొత్తపల్లి పీహెచ్‌సీలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులకు పోషకాహారం అందించామని, చిన్నపిల్లలకు టీకాలు వేయించి, వృద్ధులకు మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ సోకితే భయపడవద్దన్నారు. అనంతరం స్వచ్ఛ నారీ సశక్త్ పరివార్ గురించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ జె.ప్రవీణ్‌కుమార్, వైద్యాధికారిణి పి.రంగలక్ష్మి, పి.సందీప్, హర్షిత, కల్పన, మంజుల, సూర్యప్రకాష్, యూనస్, లక్ష్మీనరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.

సాఫ్ట్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక

సాఫ్ట్ట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక