
పండగ వేళ.. ఇల్లు జాగ్రత్త
రాయచోటి : దసరా పండగ సెలవులు వచ్చాయని ఊళ్లకు వెళ్లే సందర్భంలో ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ఓ ప్రకటనలో సూచించారు. ఇంటికి తాళం కనిపించినపుడే దొంగలు గుర్తిస్తారని ఎస్పీ హెచ్చరించారు. తలుపులకు తాళం సరిగా వేయకపోవడం, బయట తాళం వేసి వెళ్లిపోవడం, విలువైన వస్తువులు ఇంట్లో వదిలేయడం చేస్తే దొంగలకు ఆహ్వానం పలికినట్లే అన్నారు. ఇంట్లో సీసీ కెమేరాలు, అలారం, సెన్సార్ లైట్లు అమర్చాలన్నారు. ఊరిలో పరిచయం లేని వ్యక్తులు తిరుగుతుంటే జాగ్రత్తగా గమనించాలని సూచించారు. మీరు ఇంట్లో లేనప్పుడు ఆ వివరాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. నమ్మకమైన వారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి