
వీరభద్రస్వామికి వెండి గద బహూకరణ
రాయచోటి టౌన్: రాయచోటి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి కర్నాటకలోని ధార్వాడ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ చాడిచాల్ వెండి గదను బహూకరించారు. శనివారం ఆలయ ఈవో డీవీ రమణారెడ్డికి దీనిని అందజేశారు. గద విలువ రూ. 50నుంచి రూ. 55 వేలు ఉంటుందని, దీనికి సంబంధించిన రసీదును అందజేసినట్లు ఈవో తెలిపారు. దాత పేరున స్వామి, అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు అందజేశారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని మూల విరాట్‌కు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.
రాజంపేట టౌన్: ఇప్పటికే ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు, ప్రజలు తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప యనం అవుతున్నారు. దీంతో అన్ని మార్గాల్లో తిరిగే బస్సులు కిక్కిరిస్తున్నాయి. ఇదిలావుంటే శనివారం రాజంపేట పాతబస్టాండు ప్రయా ణికులతో కిటకిటలాడింది. బస్సుల్లో సీట్లు దొ రకక ఇబ్బందులు పడ్డారు. చాలామంది బస్సుకు ఎదురెళ్లి కిటికీల నుంచి సీట్లు పెట్టుకునేందుకు పోటీపడ్డారు. దసరా ముందు రోజు వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆర్టీసీ ఉన్నతాధికారులు అదనపు సర్వీసులు నడపాలని ప్రజలు కోరుతున్నారు.

వీరభద్రస్వామికి వెండి గద బహూకరణ

వీరభద్రస్వామికి వెండి గద బహూకరణ