
అత్యుత్తమ పరిశోధకుల జాబితాలో ఎల్‌వీపీఈఐ
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రతిష్టాత్మక 2025 స్టాన్‌ఫోర్డ్/ఎల్సెవియర్ టాప్–2 సైంటిస్ట్ జాబితా ప్రామాణిక సైటేషన్ మెట్రిక్స్ ఆధారంగా ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పరిశోధకుల జాబితా విడుదలైంది. ఎల్‌వీప్రసాద్ ఐ ఇన్స్‌టిట్యూట్ (ఎల్‌వీపీఈఐ) మరోసారి ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించిందని ఆ వైద్యశాల హెడ్ డాక్టర్ కావ్యమాధురి బెజ్జంకి తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఏడుగురు ఎల్‌వీపీఈఐ అనుబంధ క్లినిషియన్ శాస్త్రవేత్తలు జీవితకాల ర్యాంకింగ్స్‌లోనూ, 15 మంది 2025 వార్షిక ర్యాంకింగ్స్‌లోనూ చోటు దక్కించుకున్నారని చెప్పారు. ఎల్‌వీపీఈఐ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గుళ్లపల్లిఎన్.రావు భారతదేశంలోనే నేత్ర వైద్య రంగంలో జీవితకాల ర్యాంకింగ్‌లో రెండవ స్థానంలో నిలిచారన్నారు. ఆయతోపాటు మరో ఆరుగురు పరిశోధకులు సావిత్రిశర్మ, ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ మహ్మద్ జావిద్ అలీ, ప్రశాంత్ గర్గ్, తారాప్రసాద్‌దాస్, స్వాతి ఉత్తమ ర్యాంకుల జాబితాలో ఉన్నారని చెప్పారు. 2025 సంవత్సరానికిగానూ 61 మంది భారతీయ నేత్ర వైద్య శాస్త్రవేత్తలు వార్షిక ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించుకోగా మహ్మద్ జావిద్ అలీ, స్వాతి కలికి, సావిత్రి శర్మ, ప్రశాంత్ గర్గ్, సయన్ బసు, రోహిత్ ఖన్నా, గుళ్ళపల్లి ఎన్.రావు, స్వాతి సింగ్, తారాప్రసాద్ దాస్, ఎలిజబెత్ కీఫ్, వివేక్ సింగ్, పవన్ కుమార్ వెర్కిచర్ల, ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్, మిలింద్ నీలకంఠ నాయక్, సుభద్ర జలాలిలు జాబితాలో చోటు సంపాదించారని తెలిపారు.