
యర్రగుంట్ల మున్సిపాల్టీలో వార్డుల పెంపు
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల పురపాలక సంఘం పరిధిలో మరో ఏడు వార్డులను పెంచేందుకు డీఎంఏ(డైరెక్ట్ మున్సిపాలిటీ ఆథారిటీ) ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ శేషఫణి, మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం మున్సిపాల్టీలో 20 వార్డులు ఉండగా, 32572 మంది నివసిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండవచ్చునని భావిస్తున్నామని తెలిపారు. ఇపుడు మున్సిపాలిటీలో ఏడు వార్డులు అదనంగా పెంచుతున్నట్లు ఉత్వర్వులు వచ్చాయని ఆయన తెలిపారు. ఎవరికై నా అభ్యర్థనలుంటే అక్టోబరు ఆరో తేదీలోగా మున్సిపాలిటీలో స్వీకరిస్తామని, 8వ తేదీలోగా పూర్తి నివేదిక కలెక్టర్‌కు పంపిస్తామని పేర్కొన్నారు. 10న డీఎంఏ (డెరెక్ట్ మున్సిపాలీటీ ఆథారిటి)కి పంపిస్తామని, 12న ప్రభుత్వానికి పంపగా, 14న జీవో విడుదల అవుతుందని తెలిపారు. యర్రగుంట్ల పురపాలక సంఘంలో 27 వార్డులు ఏర్పాటుకానున్నాయని, ఓటరు శాతం ప్రకారం ఒక్కో వార్డుకు 850కి తక్కువ కాకుండా విభజించాల్సి ఉంటుందని తెలిపారు. వార్డుల విభజనపై టీఎంపీ విభాగం కసరత్తు ప్రారంభించారని, 1 నుంచి 20వ వార్డు వరకు అన్నింటినీ పరిశీలించి విభజిస్తామని పేర్కొన్నారు.
ఇక నుంచి 27 వార్డులు