
బాలకృష్ణా.. మెంటల్‌కు చికిత్స చేయించుకో..
– వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి దండు గోపి
రాజంపేట టౌన్ : 20 ఏళ్ల కిందట బాలకృష్ణకు మెంటల్ ఉందని వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారని, ఆయన సరైన చికిత్స చేయించుకోవడం లేదని.. దీంతో ఆయన పిచ్చి పీక్స్‌కు చేరిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండుగోపి ఎద్దేవా చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల కిందట అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలనుబట్టి రాష్ట్ర ప్రజలకు ఆయన వైఖరి స్పష్టంగా అర్థమైందన్నారు. బెల్లంకొండ సురేష్‌పై అతడు కాల్పులు జరిపినప్పుడు దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి దయచూపారని, లేకుంటే ఇప్పటికే జైల్లో చిప్పకూడు తినేవారంటూ ఆరోపించారు. ఇలాగే వదిలేస్తే అసెంబ్లీలో తోటి ఎమ్మెల్యేలు, మంత్రులపై చేయిచేసుకునే అవకాశం లేకపోలేదన్నారు. ప్రజాస్వామ్యంలో మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం చాలాముఖ్యమని టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.