
జేఎన్‌టీయూలో యంత్ర 2025 జాతీయ సదస్సు
పులివెందుల టౌన్ : స్థానిక జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ విభాగంలో శుక్రవారం యంత్ర 2కె25 మూడు రోజుల విద్యార్థుల జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. యూసీఐఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభాస్‌రంజన్, న్యూటెక్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ వసంత్‌కుమార్, విశాఖపట్టణం ఫోర్ట్ అథారిటీ గ్రేడ్–1 అసిస్టెంట్ సెక్రటరీ అజయ్‌తేజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి 500మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభాస్‌రంజన్ మాట్లాడుతూ మానవుడి జీవితంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), చాట్ జీపీటీ ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలు వివరించారు. అనంతరం విశిష్ట అతిథులు ఇంజినీరింగ్ ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపల్ ఎం.శేషమహేశ్వరమ్మ, మెకానికల్ విభాగాధిపతి ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.