
తప్పిన పెను ప్రమాదం
డ్రైనేజీలో నుంచి ఎగిసి పడుతున్న మంటలు, ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఎర్రగుంట్ల : పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ఆపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో హెచ్‌పీ పెట్రోల్ బంకులోని ట్యాంక్‌లోకి నీరు చేరింది. దీంతో వాహన దారులకు పెట్రోల్, డిజీల్ వేయలేదు. ఆయిల్ ట్యాంక్‌కు లీకులు ఉండడడంతో పెట్రోల్, డీజిల్ సమీపంలోని డ్రైనేజీ నీటిలో కలిసిపోయింది. దీంతో బంకు నిర్వాహకులు ట్యాంక్ చుట్టూ ఉన్న నీటిని తోడే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఒక్కసారిగా డ్రైనేజీ నుంచి మంటలు ఎగసిపడ్డాయి. సిమెంటు దిమ్మెలు పెద్ద శబ్ధంతో ఒకపక్క పగిలిపోతుండగా.. మరోవైపు మంటలు వ్యాపించి పొగ కమ్మేసింది. స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. సీఐ విశ్వనాథరెడ్డి చేరుకుని బంకు సిబ్బందితో మాట్లాడి మంటలు అర్పే ప్రయత్నం చేయించారు. అనంతరం ప్రొద్దుటూరు అగ్నిమాపక సిబ్బంది వచ్చి డ్రైనేజీలలో ఆయిల్‌ను తొలగించడానికి కెమికల్ వాడారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

తప్పిన పెను ప్రమాదం