
జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
పులివెందుల టౌన్ : విద్యార్థులు సృజనాత్మకతతో జాతీయస్థాయిలో సత్తా చాటాలని ఆర్డీఓ చిన్నయ్య అన్నారు. స్థానిక న్యాక్ బిల్డింగ్ సమీపంలో న్యూఢిల్లీ యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో శుక్రవారం ప్రారంభించారు. ఆర్డీఓ చిన్నయ్య మాట్లాడుతూ యుఎస్‌ఓ లాంటి ఎన్జీవో సంస్థలు దేశవ్యాప్తంగా విద్యార్థి సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వానికి సహకారం అందించి సఫలీకృతం అవుతున్నారని ప్రశంసించారు. త్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార్‌గుప్తా మాట్లాడుతూ యుఎస్‌ఓ జాతీయస్థాయి పోటీలను పులివెందులలో నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. విద్యార్థులు చదువుకు మాత్రమే పరిమితం కాకుండా పోటీ ప్రపంచంలో కావాల్సిన అన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలన్నారు. సెక్రటరీ జనరల్ నీనాజైన్ మాట్లాడుతూ పది రాష్ట్రాల నుంచి దాదాపు 158 మంది చిన్నారులు పాల్గొని అన్ని రాష్ట్రాల సంస్కృతులు, అలవాట్లను తెలుసుకుంటారని తెలిపారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దాసరి భానుప్రకాష్, సునీల్‌కుమార్, త్యాగరాజన్, విజయ్‌కుమార్, మిశ్రా నిఖిల్, రాజేష్, శర్మ తదితరులు పాల్గొన్నారు.