
పీలేరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలి
పీలేరు రూరల్ : పీలేరును రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మూన్‌లైట్ ఫంక్షన్ హాల్‌లో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత వందేళ్లుగా ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి చిత్తూరు, మదనపల్లె, రాయచోటికి పీలేరు వాసులు తిరగాల్సి వస్తోందన్నారు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరును కలుపుకొని మదనపల్లె జిల్లాగా చేస్తూ, రొంపిచెర్ల, పులిచెర్ల, సోమల, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం, కేవీపల్లె, పీలేరు, యర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు మండలాలలను కలిపి పీలేరు రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపల్లె బాబురెడ్డి, ఎన్.సుధాకర్‌బాబు, పురం రామ్మూర్తి, సుంకర చక్రధర్, సుదర్శన్‌రెడ్డి, కలప రవి, అమృతతేజ, శ్రీకాంత్, టిఎల్.వెంకటేష్, రామాంజులు, ముల్లంగి చంద్రయ్య, గుర్రం నారాయణ, ధరణికుమార్, సుభాష్, రఘునాథ్, విజయ్, మల్లికార్జున, రాజేశ్వరి, శ్రీనివాసులు, విశ్వనాథ, ఓబులేషు, నాగేంద్ర, ఆంజినేయులు, కొండయ్య, రవి, గురునాథ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.