
నగలతో పరారీ
రాజంపేట : రాజంపేట పట్టణంలో షపీ అనే నగల తయారీ పలు బంగారు దుకాణాల నుంచి తయారీకోసం నగలు తీసుకుని వెళ్లి కనిపించడంలేదని దుకాణాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడిగపాలెం గ్రామానికి షఫీ బండ్రాళ్ల వీధిలోని పలువురు బంగారు దుకాణాలకు నగలు తయారు చేసి ఇస్తున్నారు. దాదాపు రూ.50 లక్షలు విలువ గల నగలు తీసుకుని కనిపించడం లేదని వ్యాపారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇసుక ట్రాక్టర్‌కు జరిమానా
పెద్దతిప్పసముద్రం : మండలంలోని ఆవులరెడ్డిపల్లి సమీపంలోని ఏటీలో కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమంగా తోడి కర్నాటక రాష్ట్రానికి తరలిస్తున్నారని పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు ఇటీవల రైతులు ఫిర్యాదు చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దారు విద్యాసాగర్, భూగర్బ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటేష్, ఆర్‌ఐ చినపరెడ్డి ఇసుక నిల్వలు ఉన్న ఏటిని సందర్శించి రైతులతో సమీక్షించారు. తనిఖీ సమయంలో ఇసుక తరలింపునకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్ పట్టుబడడంతో యజమానికి రూ.10వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.