
చెరువులో గుర్తు తెలియని మృతదేహం
పీలేరురూరల్ : చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన మండలంలోని కాకులారంపల్లె పంచాయతీలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కాకులారంపల్లె పంచాయతీ చింతకొమ్మచెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం తేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు ఎవరైంది ఎలాంటి ఆధారాలు లేవని సీఐ యుగంధర్ తెలిపారు. మృతుని కుడి చేతిపై అమ్మ అని, మణికట్టుపై ఎస్‌బీఆర్ అనే అక్షరాలతో పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440796944, 9440796745 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.