
రెడ్‌బుక్ రాజ్యాంగం ఎంతో కాలం సాగదు
రాజంపేట టౌన్ : రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయించి సాగిస్తున్న కూటమి ప్రభుత్వం పాలన మరెంతో కాలం సాగదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి హెచ్చరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ రావడంతో మంగళవారం పట్టణంలోని ఆకేపాటి భవన్‌లో మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగమే మద్యం కేసు అని తెలిపారు. మిథున్‌రెడ్డి ఎకై ్సజ్‌శాఖ మంత్రి కాదని, కనీసం ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎకై ్సజ్‌శాఖ మంత్రి కాదన్నారు. అలాంటప్పుడు మిథున్‌రెడ్డికి మద్యంతో ఏం సంబంధం ఉంటుందని ఆకేపాటి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, అందువల్ల ప్రజల దృష్టి మరల్చేందుకు మద్యంలో అవినీతి జరిగిందంటూ అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మిథున్‌రెడ్డిపై నమోదు చేసిన మద్యం అక్రమ కేసు సాక్ష్యాలు లేక వీగిపోవడం ఖాయమన్నారు. మిథున్‌రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టి దాదాపు 72 రోజుల పాటు జైలులో ఉంచడం బాధాకరమన్నారు. తమ నాయకులపై కేసులు పెట్టే కొద్ది తమ పార్టీ కార్యకర్తలు జూలువిదిల్చిన సింహాల్లా పార్టీ కోసం పనిచేస్తారన్న విషయాన్ని కూటమి పార్టీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడం చంద్రబాబునాయుడు దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబునాయుడు వైఎస్సాసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడంపై చూపే శ్రద్ధ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై చూపాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రక్కాసి శ్రీవాణి, సుజాత, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు జెనుగు కృష్ణారావు యాదవ్, ఏపీఎన్‌ఆర్‌సీ మాజీ డైరెక్టర్ బీహెచ్.ఇలియాస్, వివిధ విభాగాల కన్వీనర్లు డీలర్ సుబ్బరామిరెడ్డి, పాపినేని విశ్వనాథ్‌రెడ్డి, డి.భాస్కర్‌రాజు, వడ్డే రమణ, ఖాజామొహిద్దీన్, నాగా శేఖర్‌రెడ్డి, కటారు శేఖర్‌రెడ్డి, జీవీ.సుబ్బరాజు, అబ్దుల్ మునాఫ్, రెడ్డిమాసి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి