
నేడు కలెక్టర్ సమీక్ష
మదనపల్లె : మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల అధికార యంత్రాంగంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో వివిధ అంశాలతోపాటు, తాగునీటి సమస్య, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షిస్తారని తెలిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి అధికారులు హజరుకానున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి టౌన్ : మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ స్థాయి పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి హిదాయతుల్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమి డైరెక్టర్, సెక్రటరీ షేక్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో నవంబర్ 11న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఉర్దూ భాషాభివృద్ధి, సాహిత్యానికి సంబంధించి విభిన్న విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేస్తారన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను విజయవాడలోని రాష్ట్ర ఉర్దూ అకాడమి డోర్ నంబర్76–1–06ఏ/1, 2 మాళవిక విల్లా, హెచ్‌బీ కాలనీ, భవానీపురం –520012 చిరునామాకు పంపాలని సూచించారు.
4న వాహనాల వేలం
రాయచోటి టౌన్ : రవాణాశాఖ అధికారులు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలను అక్టోబర్ 4వ తేదీ వేలం వేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని రాజంపేట ఆర్టీసీ డిపోలో అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు వేలం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ధరావత్తు రూ.5 వేలు చెల్లించి (చలానా పొందాలి) వేలంలో పాల్గొనవచ్చన్నారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి టోకెన్ పొందాలని సూచించారు. వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల వివరాలు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం
పీలేరు : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉండగలమని డీపీవో రాధమ్మ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏక్ దిన్ – ఏక్ గంట – ఏక్‌సాత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక కడప రోడ్డులో గార్బేజ్ క్లీనింగ్ నిర్వహించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇళ్లలో సేకరించిన చెత్తను బయోడిగ్రేడబుల్ వ్యర్థాలతో ఎరువులుగా తయారు చేయాలని సూచించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో రాజేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో సిగ్బతుల్లా, గ్రామ పంచాయతీ శానీటరీ ఇన్స్‌పెక్టర్ నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.
12వ పీఆర్సీ ప్రకటించాలి
మదనపల్లె రూరల్ : 12వ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా కార్యదర్శి గురుప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ సాయిశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగుల సమస్యలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గోపతి బాలకృష్ణమూర్తి, అధ్యాపకులు రమణ, రెడ్డెప్పరెడ్డి, శివపార్వతీదేవి, శ్రీదేవి, సతీష్‌రెడ్డి, నాయుడు పాల్గొన్నారు.
కడప సిటీ : మహాత్మాగాందీ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకానికి 100 శాతం సబ్సిడీతో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెలాఖరు వరకు గడువు ఉందని, ఆసక్తి, అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ బి.ఆదిశేషారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1250 మంది రైతులు 2742 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. 920 మంది రైతులకుగాను 2058 ఎకరాల్లో ప్లాంటేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. 103 మంది రైతులకుగాను 134 ఎకరాలకు సంబంధించి గుంతలు తీసి మొక్కలు నాటాల్సి ఉందన్నారు. ఈనెలాఖరు వరకు గడువు ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు ప్లాంటేషన్ మేనేజర్ ప్రతాప్ 90008 90293 నంబర్లో సంప్రదించాలని సూచించారు. మండలా ల్లో సంబంధిత ఏపీఓలను కలవొచ్చని తెలిపారు.

నేడు కలెక్టర్ సమీక్ష