
జగజ్జనని.. లోకపావని
‘దుష్టశిక్షణ.. శిష్టరక్షణ’ కోసం అమ్మవారు అనేక అవతారాలు ధరించారు. వాటిలో కొన్నింటికి విశేష చరిత్ర ఉంది. జగన్మాత రూపాలను దేవీ శరన్నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో పూజించడం సంప్రదాయంగా వస్తోంది. జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. రెండో రోజైన మంగళవారం లోకమాత ఒక్కో ప్రాంతంలో ఒక్కో అలంకరణలో దర్శనమిచ్చారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాల వెలుగుతో ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కిటకిటలాడుతున్నాయి. శక్తి స్వరూపిణిని భక్తులు కనులారా దర్శించుకుని పులకించిపోయారు. ‘జగజ్జనని.. లోకపావని’ అంటూ శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. – సాక్షి, నెట్‌వర్క్
గుర్రంకొండ : గాయత్రీదేవిగా రెడ్డెమ్మతల్లి
రాయచోటి టౌన్ : పార్వతీదేవిగా శ్రీభద్రకాళీ
ములకలచెరువు : గాయత్రీదేవిగా అమ్మవారు

జగజ్జనని.. లోకపావని

జగజ్జనని.. లోకపావని

జగజ్జనని.. లోకపావని

జగజ్జనని.. లోకపావని

జగజ్జనని.. లోకపావని

జగజ్జనని.. లోకపావని