
ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి
కలకడ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. కలకడ పోలీసుల వివరాల మేరుక. వాల్మీకిపురం మండలం దయ్యాలబండ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటరమణ భార్య శోభారాణి(34) తన వ్యక్తిగత పనులపై ఈ నెల 14న కలకడకు వచ్చింది. తిరుగుప్రయాణంలో ఇతరుల ద్విచక్ర వాహనంలో(లిప్ట్) వెళ్తుండగా.. కదిరాయచెర్వు వద్ద రోడ్డుపై వేగ నిరోధకం వద్ద వాహనం అదుపు తప్పి తలకు తీవ్రగాయమైంది. ప్రమాదంలో గాయపడ్డ శోభారాణిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. మృతురాలి తమ్ముడు శబరీష్ ఫిర్యాదుమేరకు హెడ్ కానిస్టేబుల్ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రేషన్ బియ్యం విక్రయించడం నేరం
పుల్లంపేట : రేషన్ బియ్యంను ప్రజలు విక్రయించటం చట్టరీత్యా నేరమని తహసీల్దార్ పుల్లారెడ్డి అన్నారు. మండలంలోని జాగువారిపల్లి పొలిమేరలో గురువారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బురదలో ఇరుక్కుపోయింది. ప్రజలు గుర్తించి పుల్లంపేట తహసీల్దారు పుల్లారెడ్డికి సమాచారం అందించారు. రైల్వే కోడూరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ డి.శ్రీనివాసులు తనిఖీచేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఈ లారీని బీదర్ జిల్లా వంగూరు గ్రామానికి చెందిన క్రాంతికుమార్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. అందులో 50 కిలోల బియ్యం బస్తాలు 309 ఉన్నట్లు శ్రీనివాసులు తెలియజేశారు. బియ్యాన్ని రాజంపేట స్టాక్ పాయింట్‌కు తరలించి లారీని సీజ్ చేశారు. కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.

ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి