
గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో జరిగే గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌ఏ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్స్‌రాజేంద్రన్‌కు ఏఐఎస్‌ఏ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్న అవినీతి అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. నీతి నిజాయితీగా విద్యార్థుల సంరక్షణకు పాటుపడే అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంమలో ఏఐఎస్‌ఏ నాయకులు షేక్ రెడ్డిబాషా తదితరులు పాల్గొన్నారు.