
న్యాయవాదుల విధుల బహిష్కరణ
రాయచోటి జగదాంబసెంటర్ : వివిధ కారణాలతో చనిపోతున్న న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజు ఉదయం కోర్టు పనిగంటల్లో సంతాపాన్ని తెలిపే సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడాన్ని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులుఐదవ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్‌కుట్టి, సీనియర్ సివిల్ జడ్జి ప్రసూన, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుయోధనతో కలిసి విధులు బహిష్కరించడానికి గల కారణాలను తెలియజేసిన అనంతరం కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రెడ్డిబాషా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ కారణాలతో చనిపోయిన న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజున ఉదయం. 10.30 గంటలకు సంతాపాన్ని తెలియజేసే సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిందని అన్నారు. దీనిని తక్షణం వెనక్కి తీసుకోవాలని భారత న్యాయవాదుల సంఘం అన్నమయ్య, కడప జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, సహాయ కార్యదర్శి ఖాదర్‌బాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.