
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : అర్జీదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని, వారికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదు నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నడవలేని స్థితిలో ఉన్న బాధితుల వద్దకు ఎస్పీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు ఎలాంటి సమస్య అయినా భయపడకుండా పోలీసు వద్దకు రావాలని ఎస్పీ సూచించారు.
పొలం యజమానిపై హత్యాయత్నం
మైదుకూరు : గొర్రెలు మేపుకునే విషయంలో తగాదా ఏర్పడి మండలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్య పై అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ హత్యాయత్నం చేసినట్టు అర్బన్ సీఐ కె. రమణారెడ్డి తెలిపారు. జీవి సత్రంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్యకు చెందిన బెండ తోటలో శనివారం ఆదినారాయణకు చెందిన గొర్రెలు మేస్తుండగా అడ్డుకోవడంతో వారి మధ్య గొడవ ఏర్పడినట్లు సిఐ పేర్కొన్నారు. ఆ మేరకు ఆదినారాయణ మచ్చు కత్తితో గురవయ్య పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఆదినారాయణపై సోమవారం హత్యాయ త్నం కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి