
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రాజంపేట మండలం ఊటుకూరు ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామానికి చెందిన లకిడి రామకృష్ణ (50) మృతి చెందాడు. బద్వేలులో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో రామకృష్ణ బయలుదేరాడు. ఊటూరువద్ద పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మతిస్దిమితంలేని వ్యక్తి వీరంగం
రాజంపేట : రాజంపేట స్టేట్‌బ్యాంక్ సమీపంలో మతిస్థిమితం లేని సుధాకర్ అనే వ్యక్తి సోమవారం వీరంగం సృష్టించాడు. పలువురిపై దాడి చేసిన క్రమంలో స్థానికులు పట్టుకొని కాళ్లు చేతులు కట్టేశారు. భార్యపై అనుమానంతో తన కొడుకు మతిభ్రమించిందని సుధాకర్ తల్లి ఆవేదన చెందారు. పోలీసులు రంగం ప్రవేశం చేశారు. మతిస్థిమితంలేని వ్యక్తి ఆసుపత్రిలో చేర్చిన క్రమంలో విచారణ చేశారు.
పనిచేస్తుండగా విద్యుత్ సరఫరా: ఒకరికి గాయాలు
బి.కొత్తకోట : విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం మండలంలోని తుమ్మనంగుట్టకు గౌస్‌పీర్ (19) కోటావూరు వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ స్తంభంపై జంపర్ల పనులు చేస్తున్నాడు. అంతకుముందు వరకు విద్యుత్ సరఫరా నిలిపి ఉండగా ఒక్కసారిగా సరఫరా పునరుద్ధరణ అయ్యింది. దీంతో గౌస్‌పీర్ షాక్‌కు గురయ్యాడు. బాధితున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై డిస్కం ఏడీ గోవిందరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ తన సిబ్బందితో పనులు చేయిస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిపి ఉండగా మళ్లీ ఎలా సరఫరా వచ్చింది, ప్రమాద ఘటనపై ఏఈ విచారించి నివేదిక ఇస్తారని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికి..
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. చింతపర్తికి చెందిన సత్యనారాయణ, మరో బాలిక పల్లవి(5)తో కలిసి ద్విచక్రవాహనంలో వ్యక్తిగత పనులపై వెళుతుండగా, బైపాస్‌రోడ్డులోని అరేబియన్ హోటల్ సమీపంలో మరో బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి