
పూలతోట.. నష్టాలబాట
దసరా పండగపై ఆశలు
గుర్రంకొండ: పూలతోటలు సాగు చేసిన రైతులకు ప్రస్తుతం కష్టకాలం దాపురించింది. మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆరుగాలం కష్టపడి చమటోడ్చి పండించిన పూలకు గిట్టుబాటు ధరల్లేక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పూల ధరలు రూ.10కి పడిపోయాయి. రానున్న దసరాపండుగ సమయంలోనైనా ధరలు పుంజుకొంటాయనే ఆశతో రైతులు ఉన్నారు.
1048 ఎకరాల్లో పూల సాగు...
జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో1048 ఎకరాల్లో బంతి పూలతోటల సాగు చేపట్టారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో తోటలు అదునుకొచ్చి దిగుబడి ప్రారంభమైంది. ఎకరం పూలతోట సాగు చేయాలంటే రూ.1.50లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఖర్చు వస్తుంది. పూలనారు కొనుగోలు నుంచి పొలం దుక్కులు, డ్రిప్ మెటీరియల్, మల్చింగ్‌ఖర్చు, కోతకొచ్చేవరకు రైతులకు ఈ పాటి ఖర్చు వస్తుంది. మార్కెట్లో కనీసం కిలో పూల ధర రూ.30 నుంచి 50లోపు ఉంటే రైతుకు పెట్టుబడి చేతికొస్తుంది.
● పది రోజులుగా మార్కెట్లో పూల ధరలు పతనమయ్యాయి. పదిహేను రోజుల కిందట మార్కెట్లో కిలో రూ. 70 నుంచి రూ.85వరకు ధరలు పలికాయి. తదనంతరం పరిణామాలతో బంతిపూల ధరలు మార్కెట్లో రోజురోజుకు తగ్గిపోయాయి. ప్రస్తుతం కిలో రూ.12 నుంచి రూ.10 వరకు ధరలు పలుకుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతంలోఇదే సీజన్‌లో కిలో రూ. 60 వరకు ధరలు పలికాయి. అదే ఆశతో రెండునెలలుగా పూలతోటల పెంపకం చేపట్టిన రైతులకు నిరాశే మిగిలింది.
వర్షాలకు దెబ్బతిన్నతోటలు: ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలకు బంతిపూల తోటలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించడంలేదని రైతులు వాపోతున్నారు.35 కిలోల పూల బ స్తా బెంగళూరుకు తరలించాలంటే రూ. 250 వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.10 పలుకుతోంది. ఈలెక్కన ఒక బస్తాకు రూ.525 మా త్రమే ఒక్కోసారి గిట్టుబాటు లభిస్తోంది. అంత దూరం మార్కెట్‌కు తీసుకెళ్లినా బస్తాపైనా రూ.275 మాత్రమే రైతుకు గిట్టుబాటు అవుతోంది. దీంతో పూలను మార్కెట్లకు తరలించినా ప్రయోజనం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పూల సాగు, ధరల వివరాలు
రానున్న దసరా పండుగ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకొన్నారు. ధరలు పతనమవడంతో వ్యాపారులు పూల కొనుగోలుపై పెద్ద ఆసక్తి చూపించడంలేదు.జిల్లాలో సాగు చేసేపూలను మదనపల్లె, కడప, తిరుపతి, బెంగళూరు, చైన్నె లాంటి పట్టణాలకు తరలిస్తుంటారు. ఇటీవల పూల బస్తాలతో బెంగళూరు మార్కెట్‌కు వెళ్లిన రైతులకు కనీసం వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు దసరా పండుసీజన్‌లో గిట్టుబాటుధరలు లభిస్తాయనే ఆశతో ఉన్నారు.
పూల ధరలు భారీగా పతనం
ఆందోళనలో అన్నదాతలు
జిల్లాలో 1048 ఎకరాల్లో పూలసాగు
ధరలు పడిపోయాయి
ప్రస్తుతం మార్కెట్లో పూలధరలు పడిపోయాయి. పదిహేనురోజుల కింద కిలో రూ.65 వరకు ఉండేది. ఇప్పుడు అష్టకష్టాలు పడి మార్కెట్‌కు పూలను తరలించినా అంతంత మాత్రంగానే ఆదాయం వస్తోంది.
– నారాయణ, పూలరైతు,మొరంపల్లె
పెట్టుబడి నష్టపోయాం
రెండు ఎకరాల్లో పూలతోటలు సాగు చేశాను. వర్షాలతో తోటలు దెబ్బతిన్నాయి.ఇప్పటివరకు రూ.3 లక్షలు ఖర్చు వ చ్చింది. ప్రస్తుతం ధరలు పడిపోయాయి. దీంతో పెట్టుబడి నష్టపోయాం.
– సావిత్రమ్మ, పూలరైతు, కొత్తపల్లె
నియోజకవర్గం పూలసాగు 3 నెలలుగా ధరలు
(ఎకరాల్లో) (కిలోల్లో)
పీలేరు 325 జూన్ 15 రూ. 45
మదనపల్లె 245 జులై 01 రూ.40
తంబళ్లపల్లె 295 జులై 15 రూ. 57
రాయచోటి 55 ఆగస్టు 01 రూ.75
రైల్వేకోడూరు 63 ఆగస్టు 15 రూ.85
రాజంపేట 65 సెప్టెంబర్ 17 రూ.10

పూలతోట.. నష్టాలబాట

పూలతోట.. నష్టాలబాట