
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 22వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒకక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో 24న ధ్వజస్తంభానికి సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఆమె ఇక్కడ మాట్లాడుతూ..ధ్వజస్తంభం పునరుద్ధరణలో భాగంగా కొన్ని రోజుల కిందట బాలాలయం ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ధ్వజస్తంభం పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో మంగళవారం సంప్రోక్షణకు అంకురార్పణ చేసి, బుధవారం బాలాలయంలో ఉంచిన కలిశంలోని ప్రాణ ప్రతిష్టను ధ్వజస్తంభంలోకి సంప్రోక్షణ ద్వారా పంపనున్నట్లు చెప్పారు.
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయంతోపాటు మద్దిరేవుల గ్రామం, వంకగడ్డ రాచపల్లి సమీపంలో వెలసిన శ్రీ మారెమ్మ ఆలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లీ ..కాపాడమ్మా అంటూ అమ్మవార్లను వేడుకున్నారు. పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ క్యాడెట్ సి. నాగేంద్ర వర్మ ఆలిండియా ధాల్ సైనిక్ క్యాంప్‌లో రజిత పతకం సాధించారు.ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ తరపున న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్‌ప్స్ ప్రధాన కార్యాలయంలో ధాల్ సైనిక్ క్యాంపు నిర్వహించారు. ఇందులో నాగేంద్ర వర్మ ఫైరింగ్ ఈవెంట్‌లో ప్రతిభ కనబరిచినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. అంతేగాకుండా నాన్ మెయిన్డ్ టగ్ ఆఫ్ వార్ పోటీలో రజిత పతకం సాధించాడని, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నాడని తెలిపారు. నాగేంద్ర వర్మను చాన్స్‌లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్‌లర్ నాదేళ్ల ద్వారకనాథ్ అభినందించారు.
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయం కబడ్డీ పురుషుల క్రీడా జట్టు ఎంపికలు ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్నట్లు వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ రామసుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన క్రీడాకారులు వైవీయూ అనుసంధానమైన కాలేజీల్లో అభ్యసించినవారై ఉండాలన్నారు. ఎంపికలకు వచ్చే సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ లేదా ఫిజికల్ డైరెక్టర్‌తో సంతకం చేసినటువంటి ఎలిజిబిలిటి ఫామ్‌ను, కాలేజీ స్టడీ సర్టిఫికెట్‌పై ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించాలన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జులై 1వ తేదీ 2025 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 25 ఏళ్లలోపు ఉన్న క్రీడాకారులు అర్హులని తెలిపారు. పోటీలకు వచ్చిన క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని తెలిపారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక