చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలి
సిద్దవటం: ప్రతి ఒక్కరూ చారిత్రక కట్టడాలను, సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించుకోవాలని ఇంటాక్ జిల్లా కన్వీనర్ డాక్టర్ చిన్నపరెడ్డి తెలిపారు. సిద్దవటంలోని మట్లి రాజుల కోటలో శుక్రవారం ఆర్కిలాజికల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి. సూర్యప్రకాష్ అధ్యక్షతన ప్రపంచ వారసత్వ దినోత్సవ కార్యక్రమం జరిగింది. మందుగా పురాతన కట్టడాల ఫొటో ఎగ్జిబిషన్‌ను రేంజర్ కళావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటాక్ జిల్లా కన్వీనర్ చిన్నపరెడ్డి మాట్లాడుతూ ఇంటాక్ ద్వారా ప్రతి విద్యార్థిని యంగ్ ఇంటాక్‌లో చేర్పించి దేశంలోని వారసత్వ కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.ఆర్కిలాజికల్ అసిస్టెంట్ సూపరింటెండెంటు సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రాచీన కట్టడాలు, స్మారక చిహ్నాలు , స్థలాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది ఏప్రిల్ 18న ప్రపంచ, వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. సిద్దవటం రేంజర్ కళావతి మాట్లాడుతూ అడవులకు కొందరు నిప్పు పెట్టడం వల్ల వృక్షాలు, పక్షులు, జంతువులు కాలిపోవడంతో పాటు పర్యావరణం దెబ్బతింటోందన్నారు.వీటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. అంతకు ముందు మట్టిరాజుల కోట నుంచి ్ల విద్యార్థులు , అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఇంటాక్ సభ్యులు రచించిన చరిత్ర పుస్తకాన్ని సూర్యప్రకాష్ ఆవిష్కరించారు.ఇంటాక్ సభ్యులు రంగనాథ్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, పి.వెంకట్రామిరెడ్డి,ఓ.వి. రెడ్డి, అసిస్టెంట్‌అర్కిలాజికల్ అఽధికారి కమలాసన్, ఉద్యానశాఖ అస్టెంట్ వెంకటరమణ, జిల్లా పురావస్తు శాఖ అధికారి డాకారెడ్డి, సీ నియర్‌ఫొటోగ్రాఫర్ సత్యనారాయణ పాల్గొన్నారు.


