సమష్టి కృషితో పార్టీని బలోపేతం చేసుకుందాం
సంబేపల్లె : సమష్టి కృషితో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పంచాయతీ తిమ్మక్కగారిపల్లెలో మాజీ జెడ్పీటీసి ఉపేంద్రనాఽథ్‌రెడ్డి నివాసంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డితో కలసి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జగనన్న పాలనలో శెట్టిపల్లె గ్రామం అభివృద్ధికి వివిధ పధకాల ద్వారా దాదాపు రూ. 60 కోట్లకు పైగా నిధులు వచ్చాయని శ్రీకాంత్‌రెడ్డి ఎదుట నాయకులు గుర్తు చేసుకున్నారు. అనంతరం మాజీ కోఆప్షన్ జాఫర్‌ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో అనిరుథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నాగారెడ్డి, ఆనంద్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మధన్‌మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి, రమణారెడ్డి, మాధవ్, శివయ్య, నౌషాద్, సయ్యద్, సమీర్, మహేశ్వర, శంకర్, శివయ్య తదితరలు పాల్గొన్నారు.


