ఓబులవారిపల్లె : మంగంపేట స్నేహ మినరల్స్ కంకర క్రషర్ మిల్లు లీజు అగ్రిమెంట్ వివాదంలో జరిగిన గొడవపై నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. స్నేహ మినరల్స్ క్రషర్‌కు సంబంధించి తిరుపతికి చెందిన బాబ్జీ గునిపాటి రాయుడు వద్ద మూడు సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకున్నాడు. ఇరువురి లావాదేవీలపై వ్యత్యాసం రావడంతో కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. శనివారం గునిపాటి రాయుడు తన వర్గీయులతో కలిసి క్రషర్‌ను అడ్డుకున్నాడు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గునిపాటి రాయుడు, ఆయన డ్రైవర్ సుదర్శన్, లీజు దారుడు బాబ్జీ, ఆయన డ్రైవర్ భానుప్రకాష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.
కడప గౌస్ నగర్ ఘటనపై ఎస్పీ సీరియస్
కడప అర్బన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున రాత్రి 8 గంటల సమయంలో కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్‌లో జరిగిన అల్లర్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ కఠిన చర్యలు చేపట్టారు. ఇరు వర్గాలకు చెందిన వారు రాళ్ల వర్షం కురిపించుకున్నా.. చర్యలు తీసుకునే విషయంలో అజాగ్రత్తగా ఉన్నారని.. కడప వన్‌టౌన్ సీఐ సి భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐలు తిరుపాల్‌నాయక్, ఎర్రన్న, మహమ్మద్‌రఫీ, ఆలీఖాన్, రంగస్వామిలకు ఛార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. కడప వపోలీసు అధికారులతో శనివారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.