
సాక్షి రాయచోటి : స్కిల్ స్కామ్ కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు శత విధాలా న్యాయవాదుల ద్వారా ప్రయత్నాలు సాగించినా చివరకు రిమాండుకు ఆదేశించడంతో రోజంతా ఉన్న ఉత్కంఠకు తెర పడింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని వాదనలు, కొనసాగినా చివరకు చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పలేదు.ఒకవైపు టీడీపీ అధినేతకు మద్దతుగా అధిష్టానం ధర్నాలు, దీక్షలు చేస్తూ నిరసనలు తెలియజేయాలని అధిష్టానం ఆదేశించినా రోడ్లపై తమ్ముళ్ల జాడ కనిపించలేదు.
స్కిల్‌స్కామ్ కేసులో తీర్పు అనుకూలంగా వచ్చినా, ప్రతికూలంగా వచ్చినా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల చర్యలు బేషుగ్గా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పైగా తెలుగు తమ్ముళ్లు కూడా రోడ్డుపై ఎక్కడా కనిపించలేదు. ఆదివారం సాయంత్రం రాజంపేటలో మాత్రం కొంతమంది టీడీపీకి మద్దతుగా కొవ్వొత్తులో శాంతి ర్యాలీ నిర్వహించారు.
దానికి స్పందన లేకపోవడంతో తమ్ముళ్లు మమ అనిపించారు. పోలీసులు నిరసన ర్యాలీలకు, విజయోత్సవాలకు అనుమతులు ఇవ్వలేదు. ప్రజలకుఎక్కడా ఇబ్బందులు లేకుండా పత్యేక చర్యలు చేపట్టారు.
స్కిల్‌స్కామ్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు వివిధ వర్గాల ప్రజలు న్యాయం గెలిచిందని పేర్కొంటున్నారు.అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారికై నా చివరకు శిక్ష అనుభవించక తప్పదని జిల్లా వాసులు పేర్కొంటున్నారు.