ధృతరాష్ట్రుని కౌగిలిలో చిక్కి శల్యమైన బ్రహ్మయ్య, బత్యాల | Sakshi
Sakshi News home page

ధృతరాష్ట్రుని కౌగిలిలో చిక్కి శల్యమైన బ్రహ్మయ్య, బత్యాల

Published Wed, Apr 17 2024 2:00 AM

- - Sakshi

బాబు పాలిట్రిక్స్‌తో కాపుల కంట కన్నీరు..

చంద్రబాబు వైఖరిపై రగిలిపోతున్న బత్యాల, బ్రహ్మయ్య వర్గాలు

రాజంపేట: టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎదుగుదలకు,రాజకీయాల కోసం ఎవరినైనా బలిచేస్తారు. ఇందుకు ఉదాహరణగా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్యను ప్రధానంగా చెప్పుకోవచ్చు.. ఇప్పుడు అదే కోవలో రాజంపేట టీడీపీ ఇన్‌చార్జి బత్యాల చెంగల్రాయుడు కూడా చేరాడనే వాదన వారి సామాజికవర్గాల్లో వినిపిస్తోంది. బాబు వైఖరిపై బత్యాల, బ్రహ్మయ్య వర్గాలు రగిలిపోతున్నాయి. ధృతరాష్ట్రుని కౌగిలిలో నాడు బ్రహ్మయ్య, నేడు బత్యాల చిక్కి శల్యమయ్యారని కాపువర్గాలు పేర్కొంటున్నాయి.

బత్యాల తరహాలోనే సుగవాసికి చాన్స్‌..
2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బత్యాల చెంగల్రాయుడును ఎలా తీసుకొచ్చారో, అదే రీతిలో ఇప్పుడు రాయచోటి మాజీ జెడ్పీటీసీ సుగవాసి పాలకొండ్రాయుడును తీసుకొచ్చారు. బత్యాలను లూప్‌లైన్‌లోకి తోసేశారు. పట్టించుకోనే పరిస్థితిలో చంద్రబాబులేడు. రాజంపేటలో మనీపాలిట్రిక్స్‌కు చంద్రబాబు తెరలేపారని విమర్శలు వెలువడుతున్నాయి. దీంతో అటు బత్యాల, ఇటు బ్రహ్మయ్య వర్గీయులను సుగవాసి కన్నెత్తి చూడటంలేదు.బత్యాలకాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పరిచయాలు ఉండేవి.ఈ నేపథ్యంలో టికెట్‌ విషయంపై కిరణ్‌కుమార్‌రెడ్డి బత్యాలను కలిశారు. టీడీపీ అభ్యర్థి సుగవాసికి మద్దతు తెలిపాలని కోరగా బత్యాల సున్నితంగా తిరస్కరించారు. టికెట్‌ విషయంలో పునరాలోచించాలని కోరారు.అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి ఎటువంటి సమాధానం రాలేదు.

బాబు రాజకీయానికి బ్రహ్మయ్య బలి..
ఎన్టీఆర్‌ హయాంలో అనుహ్యంగా రాజకీయప్రవేశం చేసిన బ్రహ్మయ్య చంద్రబాబు రాజకీయానికి బలయ్యారు. నాలుగుసార్లు పోటీ చేసిన బ్రహ్మయ్య రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గాలిలో ఓడిపోతాడని తెలిసినప్పటికీ ఉపఎన్నికల్లో బ్రహ్మయ్యను దించి గొంతుకోశారనే అపవాదు బాబును వెంటాడుతోంది. అప్పటి నుంచి మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ కోసం బాబు చుట్టూ ప్రదక్షిణలు చేసి చివరికి అలసిపోయారు. తర్వాత ఆయన మరణించారు. ఆ విధంగా బాబు పాలిట్రిక్స్‌కు బ్రహ్మయ్య బలైపోయారు.

Advertisement
 
Advertisement