
తాడేపల్లి: తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై ఏపీ పోలీసులు థర్డ్ ప్రయోగించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా ఎలా ఉల్లంఘిస్తుందో అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ వేదికగా ఆ యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. పోలీసులకు అపరిమిత అధికారాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చి భారత రాజ్యాంగాన్ని బహిరంగంగానే ఉల్లంఘిస్తోంది. చట్ట పరంగా పాలనను సాగించడానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మానవ హక్కులను వారి రక్షణను గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యధేచ్ఛగా అమలు చేస్తుంది. పోలీసులు చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో సహా ప్రతి పౌరుడి హక్కులను కాలరాస్తున్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులైన జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్‌లను పోలీసు అధికారులు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు.
నడిరోడ్డుపై కూర్చోపెట్టి పట్టపగలే అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. ఒక సిఐ వారి కాళ్లను తన కాలితో అదిమి పెట్టగా, మరొక అధికారి వారిని కొట్టారు మిగతా పోలీసులు పక్కనే ఉండి ఆ దారుణాన్ని చిత్రీకరించారు. పైగా లాఠీలు విరిగితే కొత్తవి అందించారు. నెల క్రితం ఈ సంఘటన జరిగినా ఈ విషయంపై మాట్లాడటానికి కూడా జనం భయ పడ్డారు. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ మరోసారి తెలిసింది. ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం రాష్ట్రంలో జరిగాయి.
ఏపీలో ఒక భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించటమే. ఇది రాజ్యాంగ విలువలపై ప్రత్యక్షంగా జరిగిన దాడి. ఎవరైనా తప్పు చేస్తే పోలీసులు కోర్టుల దృష్టికి తీసుకుని వెళ్లాలి.అంతేగానీ ఇలా బహిరంగంగా దాడి చేయటానికి ప్రజాస్వామ్యం అంగీకరించదు. భారత రాజ్యాంగాన్ని బాబు సర్కారు బహిరంగంగానే ఉల్లంఘించి అరాచక పాలన సాగిస్తుందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. జరగిన ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు ట్యాగ్ చేశారు వైఎస్ జగన్.
The @ncbn-led government in Andhra Pradesh is openly violating the Indian Constitution by allowing police to exercise unchecked power. Rather than upholding the rule of law, the state is being run under a harsh “Red Book Constitution” that disregards the rights and protections… pic.twitter.com/zqvwxWXolJ
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2025
చదవండి: