చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉంది | YSRCP Leaders Slams Chandrababu Over RLIP Round Table Meeting | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉంది

Apr 10 2026 1:17 PM | Updated on Apr 10 2026 1:47 PM

YSRCP Leaders Slams Chandrababu Over RLIP Round Table Meeting

సాక్షి, అనంతపురం: చంద్రబాబుకి రైతుల కష్టాలు పట్టవని.. రాయలసీమ అంటే మొదటి నుంచి ఆయనకు చులకనేనని  వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సాధన కోఏసం వైఎస్సార్‌సీపీ పోరును ఉదృతం చేసింది. ఈ క్రమంలో శుక్రవారం అనంతపురంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా.. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అర్ధాంతరంగా నిలిపివేయడం వెనుక పెద్ద కుట్ర ఉంది. తాను చెబితేనే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్ అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు. రాయలసీమ అంటే చంద్రబాబు కు ఎందుకు చులకన?. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీమ ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ వంటిది

మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. తెలంగాణకు మేం వ్యతిరేకం కాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి అనుమానాస్పదంగా ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయితేనే తెలంగాణ మాదిరి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల్లో నీరు తీసుకోవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 854 అడుగుల్లో నీరు తరలించటం అసాధ్యం. నీటి వాటాలు ఖచ్చితంగా తీసుకొచ్చేందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. రాయలసీమ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు తో వ్యవహరిస్తున్నారు. 

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?. సీఎం రేవంత్ కోరితే... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేస్తారా??. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దొంగ ప్రాజెక్టు అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అంటున్నారు. దొంగ ప్రాజెక్టు అయితే మీరెందుకు వెయ్యి కోట్ల రూపాయల బిల్లులు విడుదల చేశారో పయ్యావుల కేశవ్ చెప్పాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయితేనే సీమ ప్రాజెక్టు లకు నీరు అందుతుంది. చంద్రబాబు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలి.  

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ..  రాయలసీమ సాగు తాగు నీటి కష్టాలు తీర్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. అదే స్ఫూర్తి ని కొనసాగించేందుకే వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన ఘనుడు చంద్రబాబు. హైకోర్టు, ఎయిమ్స్, ఇతర ప్రాజెక్టులను ఇతర ప్రాంతానికి తరలించారు. రాయలసీమ అభివృద్ధి పై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు చిత్తశుద్ధి ఏది?. సీమ వాసులు టీడీపీ కూటమికే పట్టం కడితే... మీరు చేస్తున్నది ఏమిటి?. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదాకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని చాలా మందికి తెలియదు. టీడీపీ కూటమి కి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది

ఈ సమావేశంలో.. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై. వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement