వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు | YSRCP Leader Kasu Mahesh Reddy Takes On TDP Govt | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ ఎమ్మెల్యే కక్ష సాధింపు

Mar 29 2025 6:30 PM | Updated on Mar 29 2025 7:39 PM

YSRCP Leader Kasu Mahesh Reddy Takes On TDP Govt

పల్నాడు జిల్లా:   వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తోంది.  తాజాగా పిన్నెల్లి వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలంగాణలో ఉంటున్న  వైఎస్సార్‌సీపీ నేత షేక్ సైదాను పోలీసులు అరెస్టు చేశారు.

మల్లారెడ్డిగూడెంలో షేక్ సైదాను అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తెలంగాణలోనే ఉంటున్న షేక్ సైదాపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. కూటమి ప్రభుత్వం వేధింపులను వారం క్రితమే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు షేక్ సైదాతో పాటు పిడుగురాళ్ల మండలం అగ్రహారంలో ఉంటున్న అల్లా బక్షు. వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితిని చెప్పినందుకు వీరిపై టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని కక్షగట్టారని వైఎ‍స్సార్ సీపీ గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

షేక్ సైదాను అక్రమంగా అరెస్టు చేశారని కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. పిన్నెల్లిలో టీడీపీ అరాచకాలపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామన్నారు. తెలంగాణలో నివసిస్తున్న వ్యక్తిపై 307 సెక్షన్ ఎలా పెడతారని ప్రశ్నించారు కాసు మహేష్ రెడ్డి. దీనిపై కచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.

పిన్నెల్లి YSRCP నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement